అయ్యప్ప ఆలయంలో మహా పడిపూజ

ABN , First Publish Date - 2021-12-16T05:08:47+05:30 IST

అయ్యప్ప ఆలయంలో మహా పడిపూజ

అయ్యప్ప ఆలయంలో మహా పడిపూజ
అయ్యప్పస్వామి భక్తుల శోభాయాత్ర

షాద్‌నగర్‌/షాద్‌నగర్‌ అర్బన్‌: షాద్‌నగర్‌లో బుధవారం రాత్రి అయ్యప్పస్వామి నామస్మరణ మార్మోగింది. శివమారుతి గీతాఅయ్య ప్ప ఆలయంలో గురుస్వామి సతీషన్‌నాయర్‌ నేతృత్వంలో మహాపడిపూజ నిర్వహించారు. పరిగి రోడ్డులోని పోచమ్మ ఆలయం నుంచి అయ్యప్ప ఆలయం వరకు అయ్యప్పల ఊరేగింపు నిర్వహించారు. అయ్యప్పస్వామి రథం, కేరళ నృత్యాలు, కన్యస్వాముల దీపారాధన ఆకర్షణగా నిలిచాయి. దారివెంట బాణసంచా కాల్చారు. అనంతరం భజన, పడిపూజ ప్రారంభమైంది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, మాజీ చైర్మన్‌ విశ్వంలను సతీషన్‌నాయర్‌ సన్మానించి ఆశీర్వదించారు.

Updated Date - 2021-12-16T05:08:47+05:30 IST