దృష్టిని బట్టే సృష్టి

ABN , First Publish Date - 2021-12-27T04:51:43+05:30 IST

సృష్టి కర్తలు మనుషులేనన్న వాస్తవాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని

దృష్టిని బట్టే సృష్టి
కళాకారుల సాంస్కృత కార్యక్రమాలు

  • ప్రపంచ ధ్యాన గురువు సుభాష్‌ పత్రీజీ 

ఆమనగల్లు : సృష్టి కర్తలు మనుషులేనన్న వాస్తవాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని.. కష్టం, ఇష్టం, నష్టం, సుఖం, సంపద ప్రతిదీ సంపూ ర్ణమని పిరమిడ్‌ స్పిరిచ్చువల్‌ సొసైటీస్‌ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియా వ్యవ స్థాపకులు, ప్రపంచ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ అన్నారు. దృష్టిని బట్టే సృష్టి, నడవడికని బట్టే ఫలితం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆత్మ సత్యం తెలిసిన వారు జ్ఞానులని, అది ధ్యానం ద్వారా ప్రాప్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. కడ్తాల మండలం అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్‌లో ధ్యాన మహోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. మహిళాధ్యాన మహాచక్రం- 3లో భాగంగా ఆరోరోజు ఆదివారం పత్రీజీ వేణునాథ ధ్యానంతో ఽధ్యాన సభలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా ధ్యానులనుద్దేశించి పత్రీజీ ధ్యాన, జ్ఞాన సందేశమిచ్చారు. వ్యక్తి పరివర్తనలో మార్పునకు, సన్మార్గ పురోగమనానికి ధ్యానం గొప్ప సాధన మన్నారు. ధ్యానంతో ఆత్మ స్థితిని, సంకల్ప శక్తిని పొందవచ్చన్నారు. వ్యక్తి వినయ శీలత, సంకల్ప బలానికి ధ్యాన, ఆధ్యా త్మిక కార్యక్రమాలు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. మానవతా విలువల పెంపునకు ధ్యానం గొప్ప మార్గమని పత్రీజీ పేర్కొన్నారు. ధ్యాన, శాఖాహార జగతే పిరమిడ్‌ స్పిరిచ్చువల్‌ లక్ష్యమని పత్రీజీ పేర్కొన్నారు. భారత ధ్యాన విప్లవం విశ్వ వ్యాప్తం చేసేందుకు ధ్యానులు, పిరమిడ్‌ మాస్టర్లు కంకణబద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. పిరమిడ్‌ సభా ప్రాంగణంలో పలు ధ్యాన, ఆద్యాత్మిక పుస్తకాలను పత్రీజీ ఆవిష్కరించారు. ధ్యాన విలువలను చాటుతూ పుస్తకాలను వెలువరిస్తున్న రచయితలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. పత్రీజీ రూపొందించిన పలు పుస్తకాలను కూడా ధ్యానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌,  పిరమిడ్‌ ట్రస్టీ వైస్‌చైర్మన్‌  కోర్పోలు విజయభాస్కర్‌రెడ్డి, గాయని మంగ్లీ, మిమిక్రీ ఆర్టిస్ట్‌ శివారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా పిరమిడ్‌ అధ్యక్షుడు ప్రేమయ్య, పిరమిడ్‌ ట్రస్ట్‌ సభ్యులు మారం శివప్రసాద్‌, హనుమంతరావు, రాంబాబు, సాంబశివరావు, లక్ష్మి, దామోదర్‌ రెడ్డి, మాధవి, పీఆర్వో రవిశాస్ర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-27T04:51:43+05:30 IST