బాలికపై లైంగికదాడికి యత్నం

ABN , First Publish Date - 2021-12-27T05:04:04+05:30 IST

బాలికపై లైంగికదాడికి యత్నం

బాలికపై లైంగికదాడికి యత్నం

కొడంగల్‌ రూరల్‌: మైనర్‌ బాలికపై లైంగికదాడికి యత్నించిన ఓ బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కొడంగల్‌ మండలం రుద్రారంలో ఆదివారం చోటుచేసుకుంది. కొడంగల్‌ ఎస్‌ఐ సామ్యానాయక్‌ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన ఓ బాలిక(11)పై అదే గ్రామానికి చెందిన బాలుడు(17) లైంగికదాడికి పాల్పడ్డాడు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో బాలిక గ్రామంలో గల ఓ కిరాణా షాపుకు వెళ్లి వస్తుండగా అదే గ్రామానికి చెందిన బాలుడు.. మీ ఇంటి వైపు వెళ్తున్నాను.. అని చెప్పి ఆ బాలికను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని గ్రామ శివారులోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో బాలిక ఎక్కడికి తీసుకువెళ్తున్నావని ప్రశ్నించగా.. మీ అన్నయ్యతో కలిసి ముగ్గురం ఇంటికి వెళ్దామని నమ్మించాడు. వెంటనే బాలికను బైక్‌పైౖ నుంచి దించి నోట్లో గుడ్డలు కుక్కి లైంగికదాడికి యత్నించగా.. బాలిక గట్టిగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకునేలోపు బాలుడు పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-12-27T05:04:04+05:30 IST