ఎర్రచందనం పేరుతో సండ్ర కలప విక్రయానికి యత్నం
ABN , First Publish Date - 2021-07-09T05:19:32+05:30 IST
ఎర్రచందనం పేరుతో సండ్ర కలప విక్రయానికి యత్నం

షాద్‌నగర్ అర్బన్: ఎర్రచందనం పేరుతో సండ్ర కలప మొద్దులను విక్రయించాలన్న ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఫామ్‌హౌజ్‌పై దాడి చేసి రూ.15లక్షల విలువైన 190 సండ్రా మొద్దులను స్వాధీనం చేసుకున్నారు. షాద్‌నగర్ ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకా రం.. వైఎ్‌సఆర్ కడప జిల్లా, మైదుకూరు మండలం ఎర్రబెల్లికి చె ందిన ఆదిబోయిన బ్రహ్మయ్య(28) 2020 నవంబర్‌లో నంద్యాల ఫారెస్ట్ ఆఫీసు వేలం వేసిన సండ్ర మొద్దులను కొన్నాడు. ఎర్ర చందనం కలపను పోలి ఔషధ గుణాలు కలిగిన సండ్ర మొద్దులను ఫరూఖ్‌నగర్ మండలంలోని కడియాల కుంట పంచాయతీ తిమ్మాజిపల్లి శివారులోని శ్రీహరిశర్మ మామిడి తోటలోని ఫామ్‌హౌ్‌సలో సండ్ర మొద్దులను భద్రపర్చి వాచ్‌మన్‌ను కపలా పెట్టాడు. సండ్ర కలపను ఎర్ర చందనంగా నమ్మించి విక్రయించాలని చేసిన ప్రయత్నాలు పోలీసులకు తెలియడంతో గురువారం దాడిచేశారు. సండ్ర మొద్దులను స్వాధీన పర్చుకుని ఆదిబోయిన బ్ర హ్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ తెలిపారు.