వ్యక్తిపై రియల్‌ఎస్టేట్ వ్యాపారుల దాడి
ABN , First Publish Date - 2021-05-21T04:47:43+05:30 IST
వ్యక్తిపై రియల్‌ఎస్టేట్ వ్యాపారుల దాడి

మొయినాబాద్ రూరల్: భూతగాదాల విషయంలో ఓవ్యక్తిపై కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాడిచేసిన ఘటన సురంగల్ గ్రామపరిధిలో చోటుచేసుకుంది. బాధితుడు కమ్మరి యాదగిరి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సురంగల్ గ్రామంలో కమ్మరి లక్ష్మయ్య చారికి 20గుంటల భూమి ఉంది. వీరి సమీపంలోని భూమికి సంబంధించిన కొందరూ రియల్‌ఎస్టేట్ వ్యాపారస్థులు అక్రమంగా రోడ్డును తమ పొలంలో నుంచి నిర్మించుకుంటున్నారని ఇదేవిషయంపై ప్రశ్నించి అడ్డుకోగా తనపై దాడి చేశారని యాదగిరి వాపోయాడు. తనకున్న 20గుంటల భూమి పట్టాభూమి అని ఈ భూమిలో నుంచి ఎవరికీ రోడ్డులేకున్నా తనను బెదిరించి రోడ్డు వేసుకునేందుకు ప్రయతిస్తున్నారని తెలిపాడు. తనపై దాడి చేసిన వారు సోమ గోపాల్, జావోజు రాజు, జావోజు మల్లయ్య, కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, కొత్తపల్లి మహిపాల్, మేకల దర్శన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.