కొత్తూర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవీ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2021-05-22T05:20:58+05:30 IST

కొత్తూర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవీ బాధ్యతల స్వీకరణ

కొత్తూర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవీ బాధ్యతల స్వీకరణ
చైర్‌పర్సన్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

కొత్తూర్‌: నూతనంగా ఎన్నికైన కొత్తూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్యాదేవేందర్‌యాదవ్‌ శుక్రవారం తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్లు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి ప్రత్యేక పూజల ఆనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ డోలి రవీందర్‌, కౌన్సిలర్లను సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌, కౌన్సిలర్లు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమష్టి కృషితో పార్టీలకతీతంగా మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి పరుచుకోవాలన్నారు. కొత్తూర్‌ మున్సిపాలిటీని తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. చైర్‌పర్సన్‌ లావణ్యాదేవేందర్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానన్నారు. భూగర్భ మురుగునీటి కాలువల నిర్మాణం, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈటే గణేష్‌, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, కౌన్సిలర్లు మాధవీగోపాల్‌, చింతకింది చంద్రకళారాజేందర్‌, కోస్గి శ్రీనివాస్‌, సోమ్లనాయక్‌, జె. అనితాశ్రీనివాస్‌, వీరమోని హేమాదేవేందర్‌, జయమ్మజనార్ధన్‌చారి, మాదారం నర్సింహాగౌడ్‌, ప్రసన్నలతాయాదయ్య, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు పెంటనోళ్ల యాదగిరి, నాయకులు కడెంపల్లి సదానంద్‌గౌడ్‌, మాసుల లక్ష్మయ్య, క్రాంతిరెడ్డి, సిటీకేబుల్‌ వెంకటేష్‌, రామకృష్ణ, కటికె రాజు, రవినాయక్‌, మాక్బూల్‌, ఇస్మాయిల్‌, రాఘవేందర్‌యాదవ్‌, కార్తీక్‌రెడ్డి, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-22T05:20:58+05:30 IST