పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2021-11-06T04:39:57+05:30 IST
పేకాటరాయుళ్ల అరెస్టు

వికారాబాద్/బషీరాబాద్: పేకాట ఆడుతున్న 42మందిపై కేసులు నమోదు చేసినట్లు వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. దీపావళి రోజు మూడు ప్రదేశాల్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రాగా దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడిలో వారి వద్ద నుంచి రూ.లక్షా87వేల989 నగదు, 10బైకులు, 29 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా బషీరాబాద్‌లోని ఓ హోటల్‌లో పేకాట ఆడుతున్న పదిమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 5,510 నగదు, ఆరు పెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.