నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-29T05:06:43+05:30 IST

నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు

నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు

పెద్దేముల్‌: నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తులను గురువారం ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. మండలంలోని రచ్చకట్టతండాలో నాటుసారా విక్రయాలపై ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చర్చకట్టండాకు చెందిన లోక్యానాయక్‌ వద్ద 5లీటర్ల నాటుసారా లభ్యమైంది. నాటుసారాను స్వాధీనం చేసుకొని అతడిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ తుక్యానాయక్‌ తెలిపారు. అలాగే దసరా పండగ ముందు జరిపిన దాడుల్లో సారావిక్రయిస్తుండగా సారా వదిలేసి పారిపోయిన గోపాల్‌చవాన్‌ను కూడా పట్టుకుని రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. ఇతడి వద్ద అప్పట్లో 8లీటర్ల సారాయి లభ్యమైందని చెప్పారు. 

Updated Date - 2021-10-29T05:06:43+05:30 IST