ఇబ్బందులకు గురిచేస్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-07-09T05:14:11+05:30 IST

ఇబ్బందులకు గురిచేస్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే

ఇబ్బందులకు గురిచేస్తున్న ఆర్మూర్‌ ఎమ్మెల్యే

శంకర్‌పల్లి: అధికార పార్టీ నాయకులు వారి స్వార్థం కోసం అధికారులతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను ఇబ్బ ందులకు గురిచేయడం సరికాదని సీపీఎం చేవెళ్ల డివిజ న్‌ కార్యదర్శి జంగయ్య ఆరోపించారు. గురువారం టంగటూరు గ్రామంలో ఉన్న 60 ఎకరాల ఫామ్‌ల్యాడ్‌ నిర్వాహకులపై ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తన పొలానికి దారి ఇవ్వాలంటూ దౌర్జన్యానికి దిగడం సరైన పద్ధతి కా దన్నారు. జీవన్‌రెడ్డికి టంగటూరు గ్రామంలోని ఫామ్‌ ల్యాండ్‌ వెనక 4 ఎకరాల భూమికి రోడ్డు ఇవ్వనందుకు కలెక్టర్‌, డీపీవో, డీఎల్‌పీవోలపై ఒత్తిడి చేసి ఫామ్‌ల్యాండ్‌లో నిర్మిస్తున్న భవనాన్ని కూల్చి వేయించారన్నారు. అ లాగే  జనవాడ గ్రామ శివారుల్లో ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్‌ 111జీవోలో అక్రమంగా విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌ నిర్మించారన్నారు. దానిపై ప్రతిపక్ష నాయకులు ధర్నాలు చేసినా అఽధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సామా న్యులకో నీతి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు మరో రూలా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-09T05:14:11+05:30 IST