మొయినాబాద్ తహసీల్దార్‌గా అనితారెడ్డి
ABN , First Publish Date - 2021-10-02T05:30:00+05:30 IST
మొయినాబాద్ తహసీల్దార్‌గా అనితారెడ్డి
మొయినాబాద్: మొయినాబాద్ తహసీల్దార్ కె. అనిత బదిలీపై వెళ్లగా ఆమె స్థానంలో వై.అనితారెడ్డి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆమె శనివారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్‌డీసీ-యూసీఎల్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆమె మొయినాబాద్ తహసీల్దార్‌గా బదిలీపై వచ్చారు. కాగా, రెండు సంవత్సరాలుగా ఇక్కడ పనిచేసిన కె.అనిత ఇబ్రహీంపట్నం తహసీల్దార్‌గా బదిలీపై వెళ్లారు.