అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-13T05:13:33+05:30 IST

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు

కొడంగల్‌: అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ ఐసీడీఎస్‌ను రక్షించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్సచంద్రయ్య, నాయకులు వెంకట్‌నరేందర్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవోకు  సోమవారం వారు వినతిపత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ కొడంగల్‌ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు, హెల్పర్స్‌ సమస్యలను పరిష్కరించాలన్నారు. నూతన జాతీయ విధానాన్ని రద్దుచేస్తూ ఐసీడీఎస్‌ను బలోపేతం చేయాలన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనం, ఉద్యోగభద్రతను కల్పించాలన్నారు. 

Updated Date - 2021-07-13T05:13:33+05:30 IST