ఆలంపల్లికి అనంతపద్మనాభుడు

ABN , First Publish Date - 2021-10-08T04:45:25+05:30 IST

ఆలంపల్లికి అనంతపద్మనాభుడు

ఆలంపల్లికి అనంతపద్మనాభుడు
అనంతగిరి నుంచి పల్లకిలో ఆలంపల్లికి తరలివెళుతున్న అనంత పద్మనాభుడు

  • తొమ్మిది రోజుల పాటు నిత్య పూజలు, సేవలు


వికారాబాద్‌ రూరల్‌: దసరా ఉత్సవాల్లో భాగంగా గురువారం అనంతపద్మనాభ స్వామి అనంతగిరి నుంచి వికారాబాద్‌లోని ఆలంపల్లి ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో అనంతగిరి నుంచి బండబావి మీదుగా రామయ్యగూడకు తీసుకెళ్లారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలంపల్లి ఆలయానికి చేరుకున్నారు. ఆలంపల్లిలో తొమ్మిది రోజుల పాటు స్వామి వారికి నిత్యపూజలు, సేవలను నిర్వహిస్తారు. దసరా తరువాత రోజున స్వామివారు అనంతగిరికి చేరుకుంటారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దంపతులు మంజులారమేశ్‌, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆర్‌.నర్సింహులు, కొండేటి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T04:45:25+05:30 IST