ముగిసిన అమ్మపల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-02-22T04:43:21+05:30 IST
ముగిసిన అమ్మపల్లి ఆలయ బ్రహ్మోత్సవాలు
శంషాబాద్‌రూరల్: నర్కూడ సీతారామచంద్రస్వామి (అమ్మపల్లి) ఆలయంలో ఆదివారం సీతా రాముల కల్యాణం అంగరంగ వైవంగా జరిగింది. గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఆలయ బ్రహ్మోత్సవాలు ఆదివా రం ముగిశాయి. ఈ ఉత్సవాల్లో స్ధానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్, జడ్పీటీసీ నీరటి తన్వీరాజు, మల్కారం పీఏసీఎస్ చైర్మన్ బుర్కుంట సతీ్‌ష, స్ధానిక సర్పంచ్ సున్నిగంటి సిద్దులు తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చివరిరోజు కావడంతో నగర శివారు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.