అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-05-03T04:36:00+05:30 IST

అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేస్తున్న దళిత సంఘాల నాయకులు

ఘట్‌కేసర్‌: అంబేద్కర్‌ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌ కడుపోల్ల మల్లేశ్‌ అన్నారు. ఘట్‌కేసర్‌లో ప్రబుద్ధభారతి ఇంటర్నేషనల్‌ సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో అట్టడుగు ప్రజానీకానికి విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఇతర అవకాశాలు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపర్చిన మహనీయుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. ఎనిమిది గంటల పనిదినం హక్కుగా రాజ్యాంగంలో పొందుపరిచి కార్మిక లోకానికి ఎంతో మేలు చేశారని గుర్తుచేశారు. కాగా ప్రతి అదివారం అంబేద్కర్‌ను స్మరించుకుంటామని ఆ సంఘం నాయకుడు మీసాల అరుణ్‌కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో సాయిలు, నర్సింగ్‌రావు, కిరణ్‌కుమార్‌, వంశీ, హరివర్ధర్‌, ఉదయ్‌కుమార్‌, నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-03T04:36:00+05:30 IST