అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి

ABN , First Publish Date - 2021-02-07T05:11:53+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి

అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : అంగన్‌వాడీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో పోషణ్‌ అభియాన్‌పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో నీటి సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. గర్భిణులకు పోషకాహారం ఇవ్వాలని సూచించారు. ఎప్పటి కప్పుడు పిల్లల బరువు, ఎత్తు కొలవాలన్నారు. రక్తహీనత తగ్గించేందుకు కృషి చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా శిశుసంక్షేమాధికారి మోతి, సీడీపీవోలు, పోషన్‌ అభియాన్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-07T05:11:53+05:30 IST