అంతారంలో అదనపు కలెక్టర్ పర్యటన
ABN , First Publish Date - 2021-11-06T04:42:12+05:30 IST
అంతారంలో అదనపు కలెక్టర్ పర్యటన

ధారూరు: మండలంలోని అంతారం గ్రామంలో శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పర్యటించారు. గ్రామంలోని పల్లెప్రకృతి వనాన్ని, వన నర్సరీని ఆయన పరిశీలించారు. ప్రకృతి వనం, నర్సరీలు బాగున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించి వంటకాలను రుచి చూశారు. కాగా గ్రామంలో చేపట్టిన అభివ ృద్ది పనులకు సంబందించిన బిల్లులు రావటం లేదని సర్పంచ్ నర్సిరెడ్డి అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. డీఎల్‌పీఓ అనిత, మండల అధికారులు ఉన్నారు.