సమస్యల పరిష్కారానికి చర్యలు
ABN , First Publish Date - 2021-12-30T05:39:17+05:30 IST
సమస్యల పరిష్కారానికి చర్యలు

పరిగి: మునిసిపల్ పరిఽధిలోని సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని పరిగి మనిసిపల్ చైర్మన్ ఎం.అశోక్ అన్నారు. బుధవారం 12వ వార్డులో రోడ్డు కల్వర్టు పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుత.. ముందుగా దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తామని, అన్నివార్డుల్లో పార్టీలకతీతంగా పనులు చేయిస్తున్నామని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపునకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బి.ప్రవీణ్‌రెడ్డి, కౌన్సిలర్లు మునీర్, నాగేశ్వర్‌లు పాల్గొన్నారు.