‘ముంపు కాలనీల్లో చర్యలు చేపట్టాలి’

ABN , First Publish Date - 2021-10-22T05:20:29+05:30 IST

‘ముంపు కాలనీల్లో చర్యలు చేపట్టాలి’

‘ముంపు కాలనీల్లో చర్యలు చేపట్టాలి’

ఘట్‌కేసర్‌: చౌదరిగూడ పంచాయతీలోని యాదాద్రినగర్‌, స్వర్ణగిరి కాలనీలలో ఎగువ నుంచి వచ్చే వరద నీటితో జనాలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌ నీటి పారుదలశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డితో కలిసి కాలనీలలో పర్యటించారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద నీరు కాలనీలను ముంచెత్తకుండా దిగువన ఉన్న తాళ్లకుంటలోకి మళ్లించేందుకు డీపీఆర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, సురేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:20:29+05:30 IST