డీసీఎం, బైక్‌ ఢీ..

ABN , First Publish Date - 2021-02-02T05:19:34+05:30 IST

చేవెళ్ల మండలపరిధిలో డీసీఎం వ్యాన్‌, బైక్‌ ఢీకొన డంతో మంటలు చెలరేగాయి.

డీసీఎం, బైక్‌ ఢీ..
దగ్ధమవుతున్న డీసీఎం వ్యాన్‌

  • చెలరేగిన మంటలు.. ఒకరి దుర్మరణం 


చేవెళ్ల : చేవెళ్ల మండలపరిధిలో డీసీఎం వ్యాన్‌, బైక్‌ ఢీకొన డంతో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న వ్యక్తి మృతిచెందాడు. మహబుబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం చిన్నవర్వాల్‌కు చెందిన కుర్మయ్య అలియాస్‌ మూర్తి(24) చేవెళ్లలోని పెట్రోల్‌బంకులో పనిచేస్తున్నాడు. సోమవారం తన ఇంటి నుంచి చేవెళ్లకు బైక్‌పై వస్తుండగా శంషాబాద్‌ నుంచి మద్యంలోడ్‌తో పరిగి వైపు వస్తున్న డీసీఎం మీర్జాగూడ- ఖానాపూర్‌ స్జేజీల సమీపంలో ఢీకొంది. డీసీఎం కిందికి బైక్‌ దూసుకుపోవడంతో మంటలు చెలరేగాయి. బైక్‌పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలై మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.Updated Date - 2021-02-02T05:19:34+05:30 IST