అత్తింటి వారి వేధింపులతో యువతి..

ABN , First Publish Date - 2021-05-25T04:24:30+05:30 IST

అత్తింటి వారి వేధింపులతో యువతి..

అత్తింటి వారి వేధింపులతో యువతి..

యాచారం: కుటుంబ సభ్యుల వేధింపులు భరించలేక  మొగ్గుళ్లవంపులో యువతి ఆత్మహత్య చేసుకుంది.  పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కందుకూరు మండలం నేదునూర్‌కు చెందిన లలిత-శ్రీనివా్‌సరెడ్డి దంపతుల కుమార్తె స్వప్న(22)ను మొగ్గుళ్లవంపు కు చెందిన శివకుమార్‌రెడ్డి(25)కు ఇచ్చి రెండేళ్ల క్రితం పెళ్లి చేశారు. వీరికి పది నెలల పాప ఉంది. కొంతకాలంగా స్వప్న బావ రామలింగారెడ్డి, తోడికోడలు చంద్రకళ, మామ యాదిరెడ్డి ఆమెను నిత్యం సూటిపోటి మాటలతో వేధించారు. ఈ నెల 21న పశువులకు మేత వేసే విషయంలోనూ స్వప్నను దూషించారు. దాంతో ఆమె కలుపు మందుతాగింది. ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందింది. స్వప్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పద్మయ్య తెలిపారు. 

Updated Date - 2021-05-25T04:24:30+05:30 IST