గొర్రెలు పంపిణీ చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం

ABN , First Publish Date - 2021-07-30T04:30:57+05:30 IST

గొర్రెలు పంపిణీ చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం

గొర్రెలు పంపిణీ చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
మాట్లాడుతున్న కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు వెంకటేశ్‌

కడ్తాల్‌: రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు, ఆమనగల్లు పీఏసీఎస్‌ డైరెక్టర్‌ వెంకటేశ్‌, జిల్లా నాయకుడు సూదయాదయ్య ఆరోపించారు. సబ్సిడీ గొర్రెల కోసం అధికారులు గొల్లకురుమల వద్ద డబ్బులు కట్టించుకొని మూడేళ్లయినా గొర్రెలు పంపిణీ చేయడంలే దన్నారు. కడ్తాలలో గురువారం కాపరుల సంఘం ఆధ్వర్యంలో గొర్రెల పంపిణీపై సమావేశం నిర్వహించారు. రెండోవిడత గొర్రెల పంపిణీపై ప్రభుత్వ ప్రకటనలకు, నేతల మాటలకు ఎలాంటి పొంతనలేదని వెంకటేశ్‌, యాదయ్య అన్నారు. గొల్లకురుమలందరికీ గొర్రెలు పంపిణీ చేస్తామని, మొదటి విడతలో ఇచ్చిన గొర్రెల్లో మృతిచెందిన వాటికి బీమా ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించినా అమలుకావడం లేదన్నారు. డీడీలు తీసిన వారందరికి గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అదే విధంగా పెంపకందా రులకు దాణా, మెడికల్‌ కిట్లు పంపిణీ చేయాలన్నారు. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమకార్యాచరణ రూపొందిస్తామని వారు హెచ్చరించారు. ఉపఎన్నిక వచ్చిన నియోజకవర్గాల్లో గొర్రెల పంపిణీ చేస్తున్నారని, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ రాజీనామ చేసి గొర్రెల పంపిణీకి సహకరించాలని కోరారు. రాష్ట్రం మొత్తం గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం నాయకులు సూద అంజయ్య, చిందం జంగయ్య, యాదయ్య, శ్రీను, వెంకటేశ్‌, పర్వతాలు, బీరయ్య, రాజేశ్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T04:30:57+05:30 IST