సర్దార్‌ పటేల్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-12-16T05:12:05+05:30 IST

సర్దార్‌ పటేల్‌కు ఘన నివాళి

సర్దార్‌ పటేల్‌కు ఘన నివాళి
సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న బీసీ సంఘం నాయకులు

తాండూరు : ఉక్కుమనిషి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ 71వ వర్థంతిని తాండూరు బీసీ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. వల్లాభాయ్‌పటేల్‌ చిత్రపటానికి బీసీ నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్‌, యువజన సంఘం అధ్యక్షుడు బోయ నరేష్‌, ఉపాధ్యక్షుడు బోయ రాధాకృష్ణా, టైలర్‌ రమేష్‌, అశోక్‌, అజయ్‌, సమీ, మతిన్‌, మహేష్‌, మహాదేవ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T05:12:05+05:30 IST