పేదింటి బిడ్డకు అరుదైన గౌరవం

ABN , First Publish Date - 2021-12-31T04:41:52+05:30 IST

దండ కడియం కవితా సంపుటికి మాడ్గుల

పేదింటి బిడ్డకు అరుదైన గౌరవం
తల్లి ఎల్లమ్మకు దండ కడియం పుస్తకాన్ని అందజేస్తున్న తగుళ్ల గోపాల్‌

  • దండకడియం కవితా సంపుటికి తగుళ్ల గోపాల్‌కు  కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం
  • మాడ్గుల మండలం కలకొండ వాసికి జాతీయస్థాయిలో గుర్తింపు 
  • గోపాల్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు 


ఆమనగల్లు : దండ కడియం కవితా సంపుటికి మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన ఉపా ధ్యాయుడు తగుళ్ల గోపాల్‌కు జాతీయస్థాయిలో అత్యు త్తమ గౌరవం దక్కింది. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం-2021 అవార్డుకు గోపాల్‌ ఎంపిక య్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ గురువారం మూడు విభాగాల్లో కవులు, రచయితలను అవార్డులకు ఎంపిక చేసింది. తెలం గాణ రాష్ట్రం నుంచి గోరటి వెంకన్న, దేవరాజు మహా రాజ్‌లతోపాటు తగుళ్ల గోపాల్‌ ఈ పురస్కారానికి ఎంపిక య్యారు. కలకొండ గ్రామానికి చెందిన నిరుపేద ఎల్లమ్మ కృష్ణయ్య దంపతుల కుమారుడు తగుళ్ల గోపాల్‌ నాగర్‌ కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్‌ ప్రాథమి కోన్నత పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. 2019లో గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులు, మానవ అనుబం ధాలపై దండ కడియం అనే కవితా సంపుటిని రచిం చాడు. కవి సంఘమం పబ్లికేషన్‌ దండకడియం పుస్త కాన్ని ప్రచురించింది. అనతికాలంలోనే తగుళ్ల గోపాల్‌ రచించిన ఈ పుస్తకం దేశస్థాయిలో అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతకుముందు గోపాల్‌ రచించిన తీరొక్క పువ్వు కవితా సంపుటి కూడ ప్రశంసలు పొందింది. దండ కడియం, తీరొక్క సంపుటిలకు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ యూనివర్సిటీతోపాటు అనేక సంస్థలు గోపాల్‌కు అవార్డు లను అందించాయి. నిరుపేద కుటుంబంలో పుట్టిన గోపాల్‌ పశువుల కాపరిగా ఉంటూ గ్రామానికి చెందిన గొర్రె రాజవర్థన్‌రెడ్డి సహకారంతో పట్టుదలతో నాగార్జున సాగర్‌ బీసీ రెసిడెన్సియల్‌ పాఠశాలలో పదోతరగతి వరకు పూర్తి చేశాడు. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో పీజీ పూర్తి  చేసుకున్న గోపాల్‌ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి గ్రామీణ ప్రజల జీవన స్థితి గతులపై రచనల ప్రారం భించారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం -2021కి తాను రచించిన దండ కడియం పుస్తకం ఎంపిక కావడం పట్ల గోపాల్‌ హర్షం వ్యక్తం చేశారు. పాలమూరు శ్రామిక జీవితానికి, తెలంగాణ భాషకు దక్కిన అరుదైన గౌరవమని ఆయన పేర్కొన్నారు. తనకు అవార్డు ప్రకటిం చిన కేంద్ర సాహిత్య అకాడమఈకి, తెలంగాణ ప్రభు త్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా గోపాల్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అవార్డు రావడం పట్ల దుందుబి సాహితీ అధ్యక్షుడు కె. గోపాల్‌జీ, రాజవర్ధన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 



Updated Date - 2021-12-31T04:41:52+05:30 IST