ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో వంశీకృష్ణకు చోటు

ABN , First Publish Date - 2021-07-13T04:55:51+05:30 IST

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో వంశీకృష్ణకు చోటు

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో వంశీకృష్ణకు చోటు

తాండూరు: తాండూరుకు చెందిన మూన్‌ వాకర్‌ వంశీకృష్ణ ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున వంశీకృష్ణ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో గరుఢాసనం(ఈగల్‌ పోజ్‌) వేసి ప్రపంచ రికార్డును బ్రేక్‌ చేసే ప్రయత్నం చేసిన విషయం విధితమే. కాగా, క్రిషన్‌ అనే వ్యక్తి 5 నిమిషాల 9 సెకన్ల నిరవధికంగా గరుఢాసం వేసి రికార్డు సృష్టించగా, వంశీకృష్ణ 5 నిమిషాల 19 సెకన్ల పాటు ఆసనం వేసి పాత రికార్డును బ్రేక్‌ చేశాడు. దీంతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సహకారంతో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ రికార్డులను కైవసం చేసుకుంటానని తెలిపాడు.

Updated Date - 2021-07-13T04:55:51+05:30 IST