ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-11-27T05:06:44+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి
మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం అందజేస్తున్న సీఎల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌

తలకొండపల్లి : మండల పరిధిలోని వెల్జాల గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి, గట్టిప్పలపల్లిలో బ్యాంక్‌ను  ఏర్పాటు చేయాలని తలకొండపల్లి మాజీ ఎంపీపీ, టీఆర్‌ఎస్‌ జిల్లా సీనియర్‌ నాయకుడు సీఎల్‌ శ్రీనివా్‌సయాదవ్‌ మంత్రి హరీశ్‌రావును కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని, వెల్జాలలో ఆసుపత్రి ఏర్పాటు వల్ల దాదాపు పది గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని శ్రీనివాస్‌ యాదవ్‌ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఆసుపత్రి, బ్యాంక్‌ ఏర్పాటుకు మంత్రి హరీశ్‌రావు సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. వినతి పత్రం అందజేసినవారిలో గట్టిప్పలపల్లి సర్పంచ్‌ జయమ్మవెంకటయ్య, ఆయా గ్రామాల నాయకులు ఉన్నారు.

Updated Date - 2021-11-27T05:06:44+05:30 IST