6,691 రేషన్‌ కార్డులు మంజూరు

ABN , First Publish Date - 2021-07-25T05:13:00+05:30 IST

6,691 రేషన్‌ కార్డులు మంజూరు

6,691 రేషన్‌ కార్డులు మంజూరు

వికారాబాద్‌: జిల్లాలో 6691మంది లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు కలెక్టర్‌ పౌసుమిబసు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 7424 మంది దరఖాస్తు చేసుకోగా 733 దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్లు తెలిపారు. ఈనెల 26న మంత్రి సబితారెడ్డి కార్డులను అందించనున్నట్లు తెలిపారు. కాగా, కొడంగల్‌ నియోజకవర్గంలో 841, పరిగిలో 1411, తాండూరులో 2494, వికారాబాద్‌లో 1743 మంది లబ్ధిపొందనున్నట్లు వివరించారు.  

Updated Date - 2021-07-25T05:13:00+05:30 IST