సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో 5కే రన్‌

ABN , First Publish Date - 2021-07-25T05:21:48+05:30 IST

సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో 5కే రన్‌

సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో 5కే రన్‌
5కే రన్‌ను ప్రారంభిస్తున్న స్పోర్ట్స్‌ అకాడమీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి

  • ప్రారంభించిన స్పోర్ట్స్‌ అకాడమీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): టోక్యో ఒలింపిక్స్‌ను పురస్కరించుకుని భారత దేశం తరపున పా ల్గొంటున్న క్రీడాకారులకు మద్దతుగా నెహ్రూ యువ కేంద్ర, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల ఆధ్వర్యంలో 5కె రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. సరూర్‌నగర్‌లోని ఇండోర్‌ స్టేడియంలో శనివారం జరిగిన ఈ పోటీలను స్పోర్ట్స్‌ అకాడమీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, నెహ్రూ యువకేంద్ర సంఘటన రాష్ట్ర సంచాలకులు అన్షుమన్‌ ప్రసాద్‌దాస్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేడియంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, యువజన అధికారులు రాజేష్‌, ఈసయ్య, ఖుష్బూ గుప్తా, చంద్రశేఖర్‌, కృష్ణారావు, శ్రీను, శంకర్‌, జిల్లా నెహ్రూ యువ కేంద్ర అధికారి టి.ఐజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T05:21:48+05:30 IST