జిల్లాలో 31 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-06-23T05:12:05+05:30 IST

జిల్లాలో 31 పాజిటివ్‌ కేసులు

జిల్లాలో 31 పాజిటివ్‌ కేసులు

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): జిల్లాలో మంగళవారం 27 కేంద్రాల్లో 2526 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 31 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. తాండూరులో 6, బొంరాస్‌పేట్‌లో 5, కులకచర్లలో 4, మర్పల్లిలో 4,  పరిగిలో 3, నవాల్గలో 2, రామయ్యగూడలో 2, బషీరాబాద్‌, దౌల్తాబాద్‌, దోమ, కొడంగల్‌, వికారాబాద్‌ల్లో ఒక్కో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కాగా, జిల్లాలో మంగళవారం 623 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. పరిగిలో 156, రామయ్యగూడలో 153, తాండూరులో 107, వికారాబాద్‌లో 96, కొడంగల్‌లో 62, పెద్దేముల్‌లో 41 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. 


Updated Date - 2021-06-23T05:12:05+05:30 IST