విద్యుదాఘాతంతో 22 మేకలు మృతి

ABN , First Publish Date - 2022-01-01T04:16:00+05:30 IST

షాద్‌నగర్‌ పట్టణం సోలీపూర్‌ శివారులో గురు వారం

విద్యుదాఘాతంతో 22 మేకలు మృతి
మృతిచెందిన మేకల వద్ద విలపిస్తున్న ఆంజనేయులు దంపతులు

షాద్‌నగర్‌రూరల్‌: షాద్‌నగర్‌ పట్టణం సోలీపూర్‌ శివారులో గురు వారం రాత్రి విద్యుదాఘాతానికి గురై 22మేకలు మృతి చెందడంతో బాధిత కుటుంబం బోరున విలపించింది. గ్రామానికి చెందిన ఆంజనే యులు మేకలను పెంచుతూ జీవనం సాగి స్తుంటాడు. తన పొలం వద్ద ఇనుప కంచె ఏర్పాటు చేసి.. ఎప్పటిలాగే అందులో రాత్రివేళ జీవాలను ఉంచి వెళ్లాడు. పక్క పొలం యజమాని తన భూమి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. పొలంలో ఉన్న కరెంట్‌ స్తంభం చుట్టూ పుట్ట ఏర్పడి ఇటీవల పాము అందులోకి వెళ్లింది. పుట్టను తొలగించి రంధ్రాలు పూడుకు పోవాలని నీరు వదిలాడు. భూమి తడిసి వదులు కావడంతో స్తంభం కొద్దిగా నేలకు ఒరిగింది. దీంతో విద్యుత్‌ తీగలు పొలం చుట్టూ ఉన్న పెన్సింగ్‌తోపాటు మేకల దొడ్డి చుట్టూ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌పై పడ్డాయి. రాత్రివేళ వైరుకు ఒక్కొక్కటి వెళ్లి తగలడంతో 22 మేకలు మృతిచెందాయి. మేకల అరుపులు విని ఆంజనేయులు దొడ్డి దగ్గరికి వెళ్లిచూడగా.. విద్యుత్‌ వైర్ల నుంచి వస్తున్న మెరుపులు కనిపిం చాయి. వెంటనే లైన్‌మెన్‌కు సమాచారం ఇవ్వడంతో విద్యుత్‌సరఫరాను నిలిపివేశాడు. మేకలు చని పోవడంతో జీవనాధారం కోల్పోయామని ఆంజనేయులు దంపతులు లబోది బోమన్నారు. వీటి విలువ లక్ష రూపాయలకు పైగానే ఉంటుందని, తమను ఆదుకోవాలని వేడుకున్నారు.


బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

బాధిత ఆంజనేయులు కుటుంబానికి దాతలు ఆర్థిక సహాయం అందించారు. అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా ప్రధానకార్యదర్శి నడికూడ రఘునాథ్‌యాదవ్‌ రూ.10వేలు, విఠ్యాల గ్రామానికి చెందిన ఏనుముల రాములు యాదవ్‌ రూ.10వేలు, కాంగ్రెస్‌ నాయకుడు అందె మోహన్‌ రూ.10వేలు, చటాన్‌పల్లికి చెందిన అశోక్‌యాదవ్‌ రూ.9,999వేలు ఆంజనేయు లుకు అందించారు. Updated Date - 2022-01-01T04:16:00+05:30 IST