170 కొవిడ్ పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-01-12T05:54:15+05:30 IST
170 కొవిడ్ పాజిటివ్ కేసులు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్): వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో సోమవారం 170 కేసులు నమోదయ్యాయి. వికా రాబాద్ జిల్లాలో 11 కేసులు నమోదు కాగా మేడ్చల్ జిల్లాలో 159 కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 1,17, 320కి చేరుకుంది.
షాద్‌నగర్ డివిజన్‌లో ఇద్దరికి ..
షాద్‌నగర్‌అర్బన్: షాద్‌నగర్ డివిజన్‌లో సోమవారం 182 కరోనా ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించారు. కొత్తూర్ పీహెచ్‌సీలో 36 మందికి పరీక్షలు చేయగా ఒకరికి, షాద్‌నగర్ పీపీ యూనిట్‌లో 21 మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో...
(ఆంధ్రజ్యోతి, వికారాబాద్): వికారాబాద్ జిల్లాలో సోమవారం 11 కరోనా కేసులు నమోదయ్యాయి. తాండూరులో 7, పరిగిలో 2, వికారాబాద్, పూడూరులో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది.
మేడ్చల్ జిల్లాలో...
మేడ్చల్ : మేడ్చల్ ప్రభుత్వాసుపత్రిలో 37 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ణారణ అయినట్లు వైద్యురాలు మంజుల తెలిపారు.