1,384 మంది రిపోర్టు

ABN , First Publish Date - 2022-01-01T04:56:22+05:30 IST

1,384 మంది రిపోర్టు

1,384 మంది  రిపోర్టు
కిక్కిరిసిన డీఎంహెచ్‌వో కార్యాలయం

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌లోని  డీఎంహెచ్‌వో కార్యాలయం జాయినింగ్‌ ఉద్యోగులతో కిటకిటలాడింది. శుక్రవారం ఒక్కరోజే 1,384 మంది వివిధ క్యాడర్లలోని ఉద్యోగులు బదిలీలపై వచ్చి జాయినింగ్‌ రిపోర్టు ఇవ్వడానికి వచ్చారు. ఒకేసారి భారీగా ఉద్యోగులు రావడంతో కార్యాలయం కిక్కిరిసిపోయింది.  దీంతో జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్‌రావు అందరిని వరుస క్రమంలో నిలబెట్టడానికి, కౌంటర్లు ఏర్పాట్లు చేయడానికి స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. సిబ్బందిని పిలిపించి క్యాడర్‌వైజ్‌గా జాయినింగ్‌ రిపోర్టు తీసుకునేలా చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం 10నుంచి రాత్రి 7 గంటల వరకు  ఉద్యోగులు రిపోర్టు చేశారు.

Updated Date - 2022-01-01T04:56:22+05:30 IST