సీఎం కేసీఆర్‌ను కలిసిన జడ్పీచైర్మన్‌

ABN , First Publish Date - 2021-03-22T05:38:39+05:30 IST

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడ ంతో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు ఆదివా రం సీఎం కేసీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపా రు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన జడ్పీచైర్మన్‌
సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ వాణిదేవితో జడ్పీ చైర్మన్‌ విఠల్‌ రావు

ఖిల్లా, మార్చి 21: మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకోవడ ంతో జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు ఆదివా రం సీఎం కేసీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపా రు. అలాగే, అక్కడే ఉన్న మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన సురభి వాణిదేవికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయ నతో పాటు సందీప్‌రావు ఉన్నారు. 

మంత్రికి ఉమ్మడి జిల్లా నేతల శుభాకాంక్షలు 

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 21: మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణిదేవి గెలుపొందేందుకు కృషి చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి ఉ మ్మడి జిల్లా నేతలు అభినందనలు తెలిపారు. ము ఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల ప్రకారం మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా ఉండి ఆమె గెలుపు లో మంత్రి కీలకపాత్ర పోషించారని వారు తెలిపా రు. మంత్రిని కలిసిన వారిలో మార్కెఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్‌ రాజు, జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ గిర్దావ ర్‌ గంగారెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. 

మంత్రిని కలిసిన చిట్టాపూర్‌ గ్రామస్థులు 

నిజామాబాద్‌అర్బన్‌/బాల్కొండ: బాల్కొండ మ ండలంలోని చిట్టాపూర్‌ ఎత్తిపోతల పథకంకు అను మతులు ఇవ్వడంతో పాటు బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో ఆ గ్రామ నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఆదివారం హైదరాబాద్‌లోని మం త్రి ప్రశాంత్‌రెడ్డిని కలిశారు. 30ఏళ్ల సాగునీటి సమ స్యకు పరిష్కారం చూపిన మంత్రి వేముల ప్రశాం త్‌రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ లిఫ్ట్‌ వల్ల 3,500ల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రూ.68 కోట్లతో నిర్మించే లిఫ్ట్‌ వల్ల రెండు పంటలకు సాగునీరు అందుతుందని వారు అన్నారు. మంత్రి ని కలిసిన వారిలో సర్పంచ్‌ వనజగోవర్ధన్‌గౌడ్‌, ఎం పీటీసీ కవిత శ్యామ్‌, నియోజకవర్గ సమన్వయ క మిటీ సభ్యులు దాసరి వెంకటేష్‌, లింగాగౌడ్‌, పు ప్పాల విద్యాసాగర్‌, సాగర్‌ యాదవ్‌, వేల్పూర్‌ మా ర్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వేంపల్లి చిన్న రాజేశ్వర్‌, పోశెట్టి, డాక్టర్‌ ప్రసాద్‌గౌడ్‌, ఇతర నేతలు ఉన్నారు. 

Updated Date - 2021-03-22T05:38:39+05:30 IST