ఇంటింటికీ మొక్కలు ఎక్కడ నాటారు?

ABN , First Publish Date - 2021-10-31T05:58:00+05:30 IST

పచ్చదనంలో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేసిన మొక్కలను ఎక్కడ నాటారని అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అధికారులను ప్రశ్నించారు.

ఇంటింటికీ మొక్కలు ఎక్కడ నాటారు?

సదాశివనగర్‌, అక్టోబరు 30: పచ్చదనంలో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేసిన మొక్కలను ఎక్కడ నాటారని అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అధికారులను ప్రశ్నించారు. శనివారం మండలంలోని మొడెగాంలో స్వచ్బతలో భాగంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వందశాతం మరుగుదోడ్లు నిర్మించినప్పటికీ ఆరుబయట మలమూత్ర విసర్జన చేయడంను కట్టడిచేయడం లేదని, ప్రజలకు ఆ విషయాలపై వాల్‌పెయింట్‌ల ద్వారా తెలియపరుచాలని వివరించారు. హరితహారంలో భాగంగా ఇంటింటికీ పంపిణి చేసిన 5 మొక్కలను ప్రతీ ఇంటిముందు నాటేలా చూడాలని పంచాయతీ కార్యదర్శికి, పాలకవర్గానికి తెలిపారు. లేకుంటే తనిఖీలు నిర్వహించి మొక్కలకు సంబందించిన విలువలను జరిమానా రూపంలో వసూలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్‌వీర్‌, సర్పంచ్‌ తిరుమల, ఉపసర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ సుజాత, ఏపీవో శృతి, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-31T05:58:00+05:30 IST