కొత్త మండలాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తాం

ABN , First Publish Date - 2021-12-19T05:31:41+05:30 IST

జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన అన్ని మండ లాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ ఆరుట్ల రాజేశ్వర్‌ అన్నారు. శనివారం బోధన్‌ శాఖ గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు కావాల్సిన అన్ని పుస్తకాలను అందుబా టులో ఉంచుతామన్నారు. పుస్తక పఠనానికి అధిక సంఖ్యలో యువత రా వడం అభినందనీయమన్నారు. డీసీసీబీ డైరెక్టర్‌ గిర్దావర్‌ గంగారెడ్డి, సి బ్బంది తదితరులు పాల్గొన్నారు.

కొత్త మండలాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తాం

బోధన్‌ రూరల్‌, డిసెంబరు 18: జిల్లాల్లో కొత్తగా ఏర్పడిన అన్ని మండ లాల్లో  గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ ఆరుట్ల రాజేశ్వర్‌ అన్నారు. శనివారం బోధన్‌ శాఖ గ్రంథాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భం గా మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు కావాల్సిన అన్ని పుస్తకాలను అందుబా టులో ఉంచుతామన్నారు. పుస్తక పఠనానికి అధిక సంఖ్యలో యువత రా వడం అభినందనీయమన్నారు. డీసీసీబీ డైరెక్టర్‌ గిర్దావర్‌ గంగారెడ్డి, సి బ్బంది తదితరులు పాల్గొన్నారు. 

ఎడపల్లి గ్రంఽథాలయ పరిశీలన

ఎడపల్లి: మండల కేంద్రంలోని గ్రంధాలయాన్ని శనివారం జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్‌ ఆరుట్ల రాజేశ్వర్‌ పరిశీలించారు. రూర్భన్‌ నిధులు రూ.15 లక్షలతో నిర్మించిన అదనపు గదులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. టీఆర్‌ఎస్‌  మండల అధ్యక్షుడు శ్రీరాం, నాయకులు ఎల్లయ్య యాదవ్‌, మోహ న్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T05:31:41+05:30 IST