మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి
ABN , First Publish Date - 2021-01-13T05:13:22+05:30 IST
మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి అన్నారు. మంగళ వారం నిర్మల్ జిల్లాకేంద్రంలోని వివేకానంద చౌక్‌లో స్వామి వివేకానంద జ యంతిని నిర్వహించారు.

నిర్మల్ కల్చరల్/నిర్మల్ టౌన్/సోన్/బాసర/ముథోల్/లోకేశ్వరం/కుభీర్/ కుంటాల, జనవరి 12 : మహనీయులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి అన్నారు. మంగళ వారం నిర్మల్ జిల్లాకేంద్రంలోని వివేకానంద చౌక్‌లో స్వామి వివేకానంద జ యంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానందుడి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యద ర్శులు సామ రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కమల్‌నయన్ పాల్గొన్నా రు. స్ఫూర్తి నిర్మాణ్ వెల్ఫేర్ సొసైటీ, జిల్లా యువజనుల క్రీడల శాఖ సం యుక్తంగా వివేకానంద చౌరస్తాలో గల వివేకానందుని విగ్రహానికి క్షీరాభిషే కం చేసి పూలమాలలు వేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నాయకులు పాల్గొన్నారు. కావేరి ఫౌం డేషన్ ఆధ్వర్యంలో వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. సోన్ మండలం పాక్‌పట్ల గ్రామంలో వివేకానంద సేవ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. లోకే శ్వ రం మండలం రాజురా ప్రాథమిక పాఠశాలలో తపస్ ఆధ్వర్యంలో వివేకా నందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుంటాల బ స్టాండ్ సమీపంలోని వివేకనందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ఎస్సై శ్రీకాంత్, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కుభీర్ మండలకేంద్రంతో పాటు చొండి, సొనారి, పల్సి, పార్డి(బి) తదితర గ్రామా ల్లో జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో సీసీఐ అధికారి రూపేశ్, ఏ ఎంసీ చైర్మన్ సంతోష్ పాల్గొన్నారు. ముథోల్ మండలం తరోడా గ్రామస్థు లు వివేకనందుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో సీఐ అజయ్‌బాబు, రామాగౌడ్, వినాయక్‌రావు పా ల్గొన్నా రు. బాసరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు.