వేరు శనగ విత్తనాలు తెప్పిస్తాం

ABN , First Publish Date - 2021-10-22T05:16:10+05:30 IST

యాసంగిలో రైతులు వేరు శనగ పంటసాగు కోసం విత్తనాలను తెప్పిస్తామని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.

వేరు శనగ విత్తనాలు తెప్పిస్తాం


ఆయిల్‌ పాం సాగుపై అవగాహన కల్పిస్తాం
స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

వర్ని,అక్టోబరు 21 : యాసంగిలో రైతులు వేరు శనగ పంటసాగు కోసం విత్తనాలను తెప్పిస్తామని శాసనసభ స్పీకర్‌ పోచారం  శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. గురువారం పాత వర్ని గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. యాసంగిలో సన్న రకాల ధాన్యం సాగుతో ధాన్యం నూక కావడం వల్ల సివిల్‌ రైస్‌ మిల్లర్లు నిరాకరిస్తున్నట్లు సివిల్‌ సప్లమ్‌ అధికారులు నివేదికలు అందజేశారని దీంతో ధాన్యం కొనుగోలు భారంగా మారే పరిస్థితి ఏర్పడనుందన్నారు. పంట దళారుల పాలు కాకుండా రైతులు గిట్టుబాటు ధర కోసం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. ఈ సారి ఎంత కష్టం వచ్చినా సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని ఒప్పించి ఽధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంట మార్పిడిపై అవగాహన కలిగి ఉండాలని అందుకు ఆయిల్‌ పాం పంట సాగు కోసం అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ బాధ్యుడు సురేందర్‌రెడ్డి, ఆర్డీవో రాజేశ్వర్‌, సర్పంచ్‌ పెరిక పద్మ, ఏఎంసీ చైర్‌ పర్సన్‌ మూడ్‌ కవిత, ఉపాధ్యక్షుడు గోపాల్‌, విండో చైర్మన్‌ నామాల సాయిబాబా, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:16:10+05:30 IST