కార్యకర్తలకు అండగా ఉంటాం

ABN , First Publish Date - 2021-01-13T05:15:02+05:30 IST

బీజేపీ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటా మని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. మంగళవారం బోధన్‌ మహాలక్ష్మీ మందిరంలో బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్‌ సుభాష్‌ సం తాప సభ నిర్వహించారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం

బోధన్‌, జనవరి 12 : బీజేపీ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటా మని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య అన్నారు. మంగళవారం బోధన్‌ మహాలక్ష్మీ మందిరంలో బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్‌ సుభాష్‌ సం తాప సభ నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించిన జిల్లా అధ్యక్షుడు బస్వాలక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ బీజేపీ కార్యక ర్తల కుటుంబాలకు పార్టీ ఎప్పటికి అండగా ఉంటుందన్నారు. బీజేపీ కార్యక ర్తలు పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీకి అన్ని వేళలా సైనికుల్లా పని చేస్తున్నారని ప్రసంశించారు. బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. సభలో బీజేపీ నాయకులు మేడ పాటి ప్రకాష్‌రెడ్డి, నర్సింహారెడ్డి, డాక్టర్‌ శివప్ప, న్యావనంది గోపాల్‌, అడ్లూరి శ్రీనివాస్‌, బాల్‌రాజ్‌, రామరాజు, సిందివిజయ్‌, గొంత గంగాధర్‌, వెంకటేశ్‌, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T05:15:02+05:30 IST