శ్మశానవాటికలో వాచ్‌మెన్‌ దారుణ హత్య

ABN , First Publish Date - 2021-02-27T05:01:42+05:30 IST

బోధన్‌లో శుక్రవారం శ్మశానవాటికలో వాచ్‌మెన్‌ దారుణ హత్యకు గురైనట్లు సీఐ రామన్‌ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే పట్టణం లోని 10వ వార్డులో మైనార్టీ శ్మశాన వాటికలో యూసుఫ్‌ఖాన్‌ (60) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.

శ్మశానవాటికలో వాచ్‌మెన్‌ దారుణ హత్య

బోధన్‌, ఫిబ్రవరి 26 : బోధన్‌లో శుక్రవారం శ్మశానవాటికలో వాచ్‌మెన్‌ దారుణ హత్యకు గురైనట్లు సీఐ రామన్‌ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే పట్టణం లోని 10వ వార్డులో మైనార్టీ శ్మశాన వాటికలో యూసుఫ్‌ఖాన్‌ (60) అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. శ్మశానవాటిక ఆవరణలో ఉన్న గదిలో నివాసముంటున్నాడు. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గదిలో ఉన్న అతడిని గొంతుభాగంలో ఇనుప చువ్వతోపొడిచి హత్య చేశారు. శుక్ర వారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. డాగ్‌ స్క్వాడ్‌ను క్లూస్‌టీంను రప్పించి పోలీసులు ఆధారాలు సేకరించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామన్‌ తెలిపారు. మృతుడి కుమారుడు షౌకత్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 


Updated Date - 2021-02-27T05:01:42+05:30 IST