దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయరా?

ABN , First Publish Date - 2021-05-05T05:35:35+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజు కో కొత్తరకం సమస్య వెలుగుచూస్తోంది. ప్రస్తుతం కొన్ని కొను గోలు కేంద్రాలలో దొడ్డు ధాన్యాన్ని తీసుకోవడం లేదు. ప్రభుత్వం.. కొనుగోలు కేంద్రాలలో సన్నరకం, దొడ్డురకం ధాన్యం తీ సుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికి కొన్ని కేంద్రాల లో దొడ్డురకం ధాన్యాన్ని కాంటా చేయడంలో జాప్యం జరుగు తోంది.

దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయరా?

జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లు

ధాన్యం తీసుకునేందుకు రైస్‌ మిల్లర్ల ఆంక్షలు

ఒక్కో  కేంద్రంలో ఇరవై లారీల ధాన్యం 

ఆందోళనలో అన్నదాతలు

బోధన్‌, మే 4: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజు కో కొత్తరకం సమస్య వెలుగుచూస్తోంది. ప్రస్తుతం కొన్ని కొను గోలు కేంద్రాలలో దొడ్డు ధాన్యాన్ని తీసుకోవడం లేదు. ప్రభుత్వం.. కొనుగోలు కేంద్రాలలో సన్నరకం, దొడ్డురకం ధాన్యం తీ సుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికి కొన్ని కేంద్రాల లో దొడ్డురకం ధాన్యాన్ని కాంటా చేయడంలో జాప్యం జరుగు తోంది. రోజుల తరబడిగా దొడ్డురకం ధాన్యం కాంటాకు నోచు కోక కొనుగోలుకేంద్రాలలోనే నిలిచిపోతోంది. రైస్‌మిల్లర్లు సైతం దొడ్డురకం ధాన్యాన్ని తీసుకునేందుకు ఆంక్షలు పెడుతున్నారు. సన్నరకం ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేశాకే దొడ్డురకం ధాన్యం తీసుకుంటామని చెబుతుండడం దొడ్డురకం ధాన్యం సాగుచేసిన రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వైపు వా తావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు ఈదురు గాలు లు, అకాలవర్షాలు రైతులను అయోమయానికి గురి చేస్తుండ గా దొడ్డురకం ధాన్యం సాగుచేసిన రైతులు ధాన్యం కుప్పలను చూసి ఆవేదన చెందుతున్నారు. దొడ్డురకం ధాన్యాన్ని కాంటా చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం రైతులను ఇక్కట్లకు గురిచే స్తోంది. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు వేగ వంతంగా జరుగుతున్నా.. సన్నరకం ధాన్యాన్ని మాత్రమే కొను గోలు చేస్తున్నారు. దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేయకుం డా ఎక్కడికక్కడ నిలిపివేశారు. జిల్లాలోని బోధన్‌ డివిజన్‌ పరి ధిలోని కోటగిరి, వర్ని, రుద్రూరు, చందూరు, మోస్రా, బోధన్‌, ఎడపల్లి, రెంజల్‌ నవీపేట మండలాల్లో దొడ్డురకం ధాన్యం రా శులు ఎక్కడికక్కడ పేరుకపోయాయి. కొనుగోలు కేంద్రాలలో సన్నరకం ధాన్యాన్ని కాంటా చేస్తున్న అధికారులు దొడ్డురకం ధాన్యం విషయంలో మరి కొద్దిరోజులు ఆగాలని నిలిపివేస్తు న్నారు. ఇప్పటికే 20, 25రోజులుగా దొడ్డురకం ధాన్యం రాశుల తో ఎదురుచూస్తూ వస్తున్న రైతులు.. అకాలవర్షాలతో ఆందోళ నకు గురై అసలు దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తారా? లేదా? అని ప్రశ్నిస్తున్నారు. దీంతో వేసవికాలంలో దొడ్డురకం (10 10) రకం ధాన్యాన్ని సాగుచేసిన రైతులు గందరగోళానికి గురవుతున్నారు. దొడ్డురకం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో కాంటా చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తు న్నారు. రైస్‌మిల్లర్లు సన్నరకం ధాన్యంపై చూపిన ప్రేమ దొడ్డు రకం ధాన్యంపై చూపడం లేదు. దొడ్డురకం ధాన్యాన్ని కొనుగో ళ్ల ప్రక్రియ పూర్తయినా తరువాత చివరకు పంపాలని రైస్‌ మిల్లర్లు చెబుతుండడం రైతులను గందరగోళానికి గురి చేస్తో ంది. సహకార సొసైటీల అధికారులు, వ్యవసాయశాఖ అధికా రులు సైతం దొడ్డురకం ధాన్యాన్ని కాంటా చేయించడంలో వే చిచూసే ధోరణిలో ఉన్నారు. రైస్‌మిల్లర్లు దొడ్డురకం ధాన్యాన్ని ఇప్పుడే వద్దంటున్నారని చివరకు పంపాలని చెబుతున్నారని దొడ్డురకం ధాన్యం సాగుచేసిన రైతులు కొద్దిరోజులు ఆగాల్సిం దేనని చెబుతుండడం శోచనీయం. మరోవైపు దొడ్డురకం ధా న్యం రాశులతో ఎదురుచూపులు చూస్తున్న రైతులు ఆకాల వ ర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తుతే తమ పరిస్థితి ఏమిటని? ధాన్యం రాశులకు ఎన్ని రోజులు కాపలా కాయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో కేంద్రం పరిధిలో 20 లారీల వరకు దొ డ్డురకం ధాన్యం కాంటా చేయాల్సి ఉందని, వీలైనంత తొందర గా ధాన్యాన్ని కాంటా చేయించాలని రైతులు కోరుతున్నారు. 

సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాం..

శ్రీనివాస్‌రావు, ఏవో, కోటగిరి 

దొడ్డురకం ధాన్యం కాంటా నిలిచిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపడం జరిగిందని వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. కోటగిరి మండలంలో సు మారు పది నుంచి పదిహేను లారీలు దొడ్డురకం ధాన్యం కాంటా కావాల్సి ఉందని తెలిపారు. రైస్‌మిల్లర్‌లు సన్నరకం ధాన్యాన్ని పంపిన తరువాతే దొడ్డురకం ధాన్యాన్ని పంపాల ని ఆంక్షలు పెట్టడంతో దొడ్డురకం ధాన్యం కాంటా ఆలస్యం జరుగుతుందన్నారు.

దొడ్డురకం ధాన్యాన్ని కాంటా వేయిస్తాం

రాజేశ్వర్‌, ఆర్డీవో, బోధన్‌

దొడ్డురకం ధాన్యాన్ని కాంటా చేయిస్తామని బోధన్‌ ఆర్డీ వో రాజేశ్వర్‌ తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో దొడ్డురకం ధాన్యం కాంటా కావడం లేదని తమ దృష్టికి వచ్చిందని, రై తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైస్‌మిల్ల ర్లు మొదట సన్నరకం ధాన్యాన్ని తీసుకుంటామని చివరలో దొడ్డురకం ధాన్యం కాంటా చేసి పంపాలని చెప్పడంతోనే దొ డ్డురకం ధాన్యం నిలిపివేశామని, దొడ్డురకం ధాన్యం ఎక్కడ ఉన్న కాంటా చేయిస్తామన్నారు. 

Updated Date - 2021-05-05T05:35:35+05:30 IST