కొత్త పింఛన్‌ దరఖాస్తుకు ఓటర్‌ ఐడీ కష్టాలు

ABN , First Publish Date - 2021-08-21T05:43:29+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం తర్వాత కొత్త పింఛన్ల కోసం నిబంధనలు సడలించి.. దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో అర్హులంతా ఎగిరి గంతేశారు. కానీ, కొత్త పింఛన్ల దరఖాస్తుకు ఎ న్నో తిరకాసులు పెట్టారు.

కొత్త పింఛన్‌ దరఖాస్తుకు ఓటర్‌ ఐడీ కష్టాలు

పింఛన్‌కు ఓటరు ఐడీ కార్డు తప్పనిసరి చేసిన ప్రభుత్వం 

ఓటరు కార్డులు లేక అర్హుల అవస్థలు

ఓటరు ఐడీ కార్డు సైట్‌కు సైతం తాళం వేసిన ఎన్నికల కమిషన్‌ 

నెలాఖరు వరకే గడువు                   

ఆందోళన వ్యక్తం చేస్తున్న కొత్త పింఛన్‌ దరఖాస్తుదారులు

బోధన్‌, ఆగస్టు 20: రాష్ట్ర ప్రభుత్వం చాలా కాలం తర్వాత కొత్త పింఛన్ల కోసం నిబంధనలు సడలించి.. దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో అర్హులంతా ఎగిరి గంతేశారు. కానీ, కొత్త పింఛన్ల దరఖాస్తుకు ఎ న్నో తిరకాసులు పెట్టారు. దరఖాస్తుదారులు మీ-సేవ లో దరఖాస్తు చేసుకోవాలని.. దరఖాస్తుకు ఎలాంటి రుసుము లేదని.. ప్రభుత్వమే అన్నీ భరిస్తుందని చెప్పినప్పటికీ దరఖాస్తుదారులు ఒరిజినల్‌ ఆ ధార్‌ కార్డు, ఓటరు ఐడీ కార్డు, బ్యాంకు అ కౌంట్‌ బుక్‌ను మీ-సేవలో చూపాలి, అప్పుడే కొత్త దరఖాస్తు ఓకే అవు తోంది. అయితే, ఇక్కడే పెద్ద తిరకాసు వచ్చి పడింది. కొత్త పింఛన్లకు వయసును 60 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించడ ంతో వేలాది మంది పింఛన్ల కు అర్హత పొందనున్నారు. కానీ, అందరికీ ఆధార్‌ కా ర్డులున్నా.. ఓటరు ఐడీ కార్డులు లేకపోవడం కొత్త పింఛన్ల దరఖాస్తుకు కోటి కష్టాలు తప్పడం లేదు. వివి ధ కారణాలచేత గతంలో ఓటరు కార్డును కోల్పోయిన, వారు ఎన్నికల సమయంలో తాత్కాలికంగా స్లిప్‌ ను పొంది ఓటు హక్కును వినియోగించుకున్న వారు ఇప్పుడు కార్డులు లేక అవస్థలు పడుతున్నారు. కొత్త పింఛన్ల దరఖాస్తుకు ఒరిజినల్‌ ఓటరు ఐడీ కార్డు త ప్పనిసరి కావడం పింఛన్‌ అర్హులకు సంకటంగా మారింది. అయితే, మీ-సేవ కేంద్రాలలో కొత్త ఒ రిజినల్‌ ఓటరు ఐడీ కార్డును తీసుకుందామ ంటే ఇక్కడ అటంకాలు తప్పడం లేదు. దీంతో దేవుడు వరమిచ్చినా.. పూజా రి కరుణించలేదన్నట్లుగా కొత్త పింఛ న్‌ దరఖాస్తుదారుల పరిస్థితి మారింది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ పది రోజుల క్రిత మే ఓటరు ఐడీ కార్డు సైట్‌ను పూర్తిగా నిలిపి వేసింది. ఈ సైట్‌కు తాళం వేసి ఉండడంతో కొ త్త ఓటరు కార్డులు పొందే పరిస్థితి లేకపోవడం క నీసం ఓటరు ఐడీ కార్డు లేని వారు తాజాగా ఒరిజి నల్‌ ఐడీ కార్డులు తీసుకుందామంటే ఎన్నికల కమిష న్‌ ఆదేశాలతో ఈ సైట్‌ మూసివేసి ఉండడంతో కొత్త దరఖాస్తుదారులు మీ-సేవ కేంద్రాల వద్ద పడిగాపులు గాస్తున్నారు. మీ-సేవ నిర్వాహకులు జవాబు చెప్పలేక తలలు బాదుకుంటున్నారు. ఓటరు ఐడీ కార్డులు ఎం దుకు ఇవ్వరంటూ పింఛన్‌దారులు మీ-సేవ కేంద్ర ని ర్వాహకులపై మండిపడుతున్నారు. కానీ, ఎన్నికల క మిషన్‌ ఆదేశాలతో ఓటరు ఐడీ కార్డు సైట్‌ మూసివే సి ఉందని చెప్పినా వినేపరిస్థితులలో కొత్త పింఛన్‌దా రులు లేరు. 

దరఖాస్తు చేయాలని ఇవేమి నిబంధనలు?

కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం వయసును సడలించి.. 57 సంవత్సరాలు పూర్తయిన వారు వృద్ధా ప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం తో పల్లెలు, పట్టణాల్లో మీ-సేవ కేంద్రాల వద్ద బారు లు తీరుతున్నారు. కానీ, దరఖాస్తు చేసుకోమన్న ప్ర భుత్వం నిబంఽధనల పేరిట ఆంక్షలు పెట్టడంతో అర్హు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ-సేవ కేంద్రాల వద్ద రోజంతా పడిగాపులు పడి.. చివరికి మీ-సేవ ని ర్వాహకులు ఓటరు గుర్తింపుకార్డు లేనిది దరఖాస్తు చేయలేమని తెగేసి చెబుతుండడంతో సాయంత్రానికి తిరుగుముఖం పడుతున్నారు. ఈ పరిస్థితులు పింఛ న్‌దారులకు సంకటంగా మారాయి.  

ఓటరు ఐడీ కార్డు సైట్‌కు తాళం..

కేంద్ర ఎన్నికల కమిషన్‌ వారం రోజుల క్రితమే త మ శాఖపరమైన పనిలో భాగంగా ఓటరు ఐడీ కార్డు సైట్‌ను నిలిపివేసింది. దీంతో కొత్తగా ఎవరు ఓటరు గుర్తిం పు కార్డులను తీసుకునే పరిస్థి తులు లేవు. కేంద్ర ఎన్నికల క మిషన్‌ నిబంధనలు కావడంతో ఈ సైట్‌కు తాళం ప డింది. కొత్త పింఛన్‌దారులు ఓటరు గుర్తింపు కార్డు లు లేక ఓటరు స్లిప్‌లతో మీ-సేవ కేంద్రాలకు వెళితే అక్కడ నిర్వాహకులు గుర్తింపు కార్డులు రావడం లేద ని, సైట్‌కు తాళం వేసి ఉందని చెబుతున్నారు. ప్రభు త్వం కొత్త పింఛన్‌దారులకు ఒరిజినల్‌ ఓటరు ఐడీ తప్పనిసరి అని పెట్టడం.. అటు ఆ సైట్‌కు తాళం ఉ ండడంతో దరఖాస్తుదారులు అయోమయానికి గుర వుతున్నారు. ఎన్నికల కమిషన్‌ ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ సైట్‌కు తాళం వేసి ఉంచుతుందో తెలియ ని పరిస్థితులు ఉన్నాయి. 

నెలాఖరు వరకే దరఖాస్తు గడువు..

రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్‌కు దరఖాస్తు చేసుకు నేందుకు ఈనెలాఖరు వరకే గడవు ఇచ్చింది. సమ యం తక్కువగా ఉండడంతో అంతా హైరానా పడు తున్నారు. ఓ వైపు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిబంధన లు.. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల గడువు మధ్య కొత్త పింఛన్‌ దరఖాస్తుదారులు అయోమయా నికి గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఎన్నికల కమిషన్‌ ఓటరు గుర్తింపు కార్డు సైట్‌ను ఓపెన్‌ చేయ డం.. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పింఛన్ల దరఖా స్తుకు గడువును పెంచడం తప్పనిసరి అయింది. లేద ంటే నిబంధనలు సడలించి ఓటరు ఐడీ కార్డు నిబం ధనను తొలగిస్తే కొత్త పింఛన్‌దారులకు కష్టాలు తొల గే అవకాశం ఉంది. 

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.. 

- రాజేశ్వర్‌, ఆర్డీవో, బోధన్‌

కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఓటరు ఐడీ కార్డు సైట్‌ను నిలిపివేసింది. ఈ సమస్య వల్ల కొత్తగా పింఛన్‌కు ద రఖాస్తు చేసుకునే వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నా యి. సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. క లెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం.

Updated Date - 2021-08-21T05:43:29+05:30 IST