భక్తిభావంతోనే సత్ప్రవర్తన

ABN , First Publish Date - 2021-11-21T07:11:57+05:30 IST

ప్రస్తుత సమాజంలో చెడు మార్గాన ప్రవేశించకుండా భక్తిభావంతో సత్ప్రవర్తన కలిగి ఉండాలని అఖిల భారత హనుమాన్‌ దీక్ష పీఠాధిపతి శ్రీ దుర్గాప్రసాద్‌ ఆగాస్య పీఠాధిపతి సుగుణానందస్వామి బోధించారు. సన్మార్గంలో నడవాలంటే భగవంతుని మార్గాన్ని అనుసరించాలన్నారు.

భక్తిభావంతోనే సత్ప్రవర్తన

అఖిల భారత హనుమాన్‌ దీక్ష పీఠాధిపతి దుర్గాప్రసాద్‌

108 రోజుల పాటు కొనసాగిన కోటి హనుమాన్‌ చాలీసా ముగింపు

హన్మంతుని విగ్రహానికి అభిషేకం  

అలరించిన కళాకారుల నృత్యాలు 

బాల్కొండ, నవంబరు 20: ప్రస్తుత సమాజంలో చెడు మార్గాన ప్రవేశించకుండా భక్తిభావంతో సత్ప్రవర్తన కలిగి ఉండాలని అఖిల భారత హనుమాన్‌ దీక్ష పీఠాధిపతి శ్రీ దుర్గాప్రసాద్‌ ఆగాస్య పీఠాధిపతి సుగుణానందస్వామి బోధించారు. సన్మార్గంలో నడవాలంటే భగవంతుని మార్గాన్ని అనుసరించాలన్నారు. 108రోజుల పాటు కోటి హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించడం బాల్కొండ ప్రాంత అదృష్టమని ఆయన పేర్కొన్నారు. అందుకు అమృతధార జనచైతన్య సేవ సంస్థ గుర్తుకు రావడం అభినందనీయమన్నారు. 1100 మంది జంటతో సామూహిక హన్మాన్‌ చాలీసా పారాయణం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడి శారీరక, మానసిక అనారోగ్యం పాలయ్యారని, వారంతా పూర్తి ఆరోగ్యవంతులుగా కోలుకోవాలని కోటి హన్మాన్‌ చాలీసా పారాయణం నిర్వహించినట్టు నిర్వాహకులు అమృతధార సేవ సంస్థ నిర్వాహకులు హరచారి నారాయణ తెలిపారు. అనంతరం హన్మాన్‌ విగ్రహానికి పారాయణంతో అభిషేకం నిర్వహించారు. అంతకు ముందు కోరుట్ల శ్రీ వేంకటేశ్వర పిన్నంశెట్టి కళాక్షేత్రం, పినం శెట్టి మధు ఆధ్వర్యంలో పెరిగి కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరించింది. కార్యక్రమంలో పలువు రు పురోహితులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-21T07:11:57+05:30 IST