ఉపాధి హామీ ద్వారా కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-11-26T06:47:13+05:30 IST
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు.

కామారెడ్డి, నవంబరు 25: ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా ప్రణాళిక బద్ధంగా శ్రమశక్తి సంఘాల ద్వారా పనులను గుర్తించి అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు. ఉపాఽధి హామీ పథకంలో 260 పనులు ఉన్నాయని తెలిపారు. గేదెల, గొర్రెల షెడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల సమీపంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ ఒక్కరికి ఈ శ్రమ్ ద్వారా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకుని అర్హత గల వారందరికి బీమా సౌకర్యం కల్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్‌దోత్రే, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, ఉపాధి హామీ ఏపీడీ శ్రీకాంత్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఈసీలు తదితరులు పాల్గొన్నారు.
నాణ్యత లేని ధాన్యాన్ని సహకార సంఘాలు కొనుగోలు చేయాలి
నాణ్యత లేని ధాన్యాన్ని సహకార సంఘాల సీఈవోలు కొనుగోలు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో సహకార సంఘ కార్యనిర్వహణాధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తేమశాతం 17 లోపు ఉండే విధంగా చూడాలన్నారు. తాలు, మట్టి పెళ్లలు, నల్లని గింజలు లేకుండా శుభ్రం చేసిన ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలని తెలిపారు. రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు జమఅవుతాయని పేర్కొన్నారు.