ఉదయం 8 గంటలకే వ్యాక్సినేషన్‌ను ప్రారంభించాలి
ABN , First Publish Date - 2021-10-29T05:39:12+05:30 IST
వ్యాక్సినేషన్ సిబ్బంది, అధికారులు ఉదయం 8 గంటల వరకు ఫీల్డ్‌లోకి వెళ్లి లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్‌అర్బన్, అక్టోబరు 28: వ్యాక్సినేషన్ సిబ్బంది, అధికారులు ఉదయం 8 గంటల వరకు ఫీల్డ్‌లోకి వెళ్లి లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుంచి వీ డియో కాన్ఫరెన్స్‌లోవ్యాక్సినేషన్‌పై ఎంపీడీవోలు, ఎం పీవోలు, మెడికల్ ఆఫీసర్‌లు గ్రామ, మండల స్పెషల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండినవారు తప్పక వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ జి ల్లా టార్గెట్ 36వేలు ఉండగా తక్కువ వ్యాక్సినేషన్ జ రుగుతుందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పకడ్బందీ ప్రణాళికతో వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చిత్రమిశ్రా, ట్రైనీ కలెక్టర్ మకరంద్, సీఈవో గోవింద్, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సుదర్శన్, అధికారులు పాల్గొన్నారు.