9.51 లక్షల మందికి వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2021-10-20T05:14:29+05:30 IST

జిల్లాలో గడచిన రెండు రోజులుగా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. మంగళవారం 9లక్షల 51వేల 858 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. కాగా, ఇప్పటి వరకు జిల్లాలో 12లక్షల 2వేల 572మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. జిల్లాలో వంద శాతానికి పైగా కొవిషీల్డ్‌ వేశారు.

9.51 లక్షల మందికి వ్యాక్సినేషన్‌

పెద్దబజార్‌, అక్టోబరు 19: జిల్లాలో గడచిన రెండు రోజులుగా ఎక్కువ మందికి వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు. మంగళవారం 9లక్షల 51వేల 858 మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. కాగా, ఇప్పటి వరకు జిల్లాలో 12లక్షల 2వేల 572మందికి వ్యాక్సినేషన్‌ చేశారు. జిల్లాలో వంద శాతానికి పైగా కొవిషీల్డ్‌ వేశారు. సరఫరా మెరుగు పడడంతో ఎక్కువ మందికి డోసులు వేస్తున్నామని జిల్లా వ్యాక్సినేషన్‌ అధికారి శివశంకర్‌ తెలిపారు.  
జిల్లాలో మరో మూడు కరోనా కేసలు
అలాగే, జిల్లాలో మంగళవారం మూడు కరోన కేసులు నమోదు అయ్యాయి. అన్ని పీహెచ్‌సీల పరిధిల్లో మొత్తం 284 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఈ కేసులు బయటపడ్డాయి.
ఫ బోధన్‌లో ఇంటింటా వ్యాక్సినేషన్‌
బోధన్‌ రూరల్‌, అక్టోబరు 19: బోధన్‌లోని పలు వార్డులలో మంగళవారం వైద్య సిబ్బంది ఇంటింటా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. వందశాతం వ్యాక్సినేషన్‌ చేయాలనే ఉద్దేశంతో పట్టణంలో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సినేషన్‌ వేశారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ విద్య కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారి శివానందం, మెడికల్‌ సిబ్బంది, మెప్మా ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:14:29+05:30 IST