త్వరితగతిన పనులు చేపట్టాలి : మంత్రి
ABN , First Publish Date - 2021-11-26T05:48:38+05:30 IST
పట్టణంలో రూ.8.5కోట్లతో చేపడుతున్న సెంట్రల్ లైనింగ్ పనులు, రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని రాష్ట్ర రోడ్డు భ వనాలు, గృహ నిర్మాణం, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాం త్‌రెడ్డి ఆదేశించారు.

బాల్కొండ, నవంబరు25: పట్టణంలో రూ.8.5కోట్లతో చేపడుతున్న సెంట్రల్ లైనింగ్ పనులు, రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని రాష్ట్ర రోడ్డు భ వనాలు, గృహ నిర్మాణం, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాం త్‌రెడ్డి ఆదేశించారు. గురువారం బాల్కొండ మండల కేంద్రంలో చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు. బాల్కొండ పట్టణ సుందరీకరణ కోసం చేపట్టే రోడ్డు విస్తరణ పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. రూ.90లక్షలతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో లింగాగౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు లింగాగౌడ్, సహిద్, ప్రసాద్‌గౌడ్, విద్యాసాగర్, సయ్యద్‌ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.