డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

ABN , First Publish Date - 2021-07-09T05:15:47+05:30 IST

టీయూ అనుబంధ కళాశాలలో నిర్వహిస్తున్న డిగీ పరీక్షల్లో గురువారం ఇద్దరిని డిబార్‌ చేసినట్లు సీ వోఈ డాక్టర్‌ పాత నాగరాజు తెలిపారు.

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 8: టీయూ అనుబంధ కళాశాలలో నిర్వహిస్తున్న డిగీ పరీక్షల్లో గురువారం ఇద్దరిని డిబార్‌ చేసినట్లు సీ వోఈ డాక్టర్‌ పాత నాగరాజు తెలిపారు. పరీక్ష కేం ద్రాలను తనిఖీ చేసిన సమయంలో కామారెడ్డిలోని మంజీర డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో 3వ సెమి స్టర్‌ అడ్వాన్సు అకౌంటింగ్‌ సబ్జెక్టులో ఒకరు, మధ్యా హ్నం బోధన్‌లో ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్యాం కింగ్‌ థియరీ, ప్రాక్టీస్‌ సబెక్టు పరీక్షలో మాల్‌ ప్రాక్టీ స్‌కు చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు. దీంతో వారిని డిబార్‌ చేసిరట్లు డి గ్రీ బీఏ, బీకాం, బీఏస్సీ, బీబీఏ, బీఏఎల్‌ కోర్సులకు చెందిన 3,5,సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు, ఎంఈడీ రెండో సెమిస్టర్‌, బ్యాక్‌లాగ్‌ థియరీ పరీక్షలు జరిగాయని తెలిపారు. ఉదయం 10 నుంచి 12 వరకు డిగ్రీ 3వ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీ క్షలకు మొత్తం 7726 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 813మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. ఎంఈడీ 2వ సెమిస్టర్‌ రెగ్యూలర్‌, బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు 38మంది గాను 34మంది హాజ రయ్యారని గైర్హాజరయ్యరన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 4వరకు డిగ్రీ 5వ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలకు మొత్తం 7427మంది విద్యార్థులకు 6774మంది హాజరైనట్లు తెలిపారు.

Updated Date - 2021-07-09T05:15:47+05:30 IST