టీయూలో ఈ-కామర్స్, సైబర్ క్రైంపై వెబ్‌నార్
ABN , First Publish Date - 2021-10-28T05:44:39+05:30 IST
టీయూ కామర్స్ విభాగంతో పాటు లా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ-కామార్స్ సైబర్ క్రైంపై బుధవారం వెబ్‌నార్ నిర్వహించారు.

డిచ్‌పల్లి, అక్టోబరు 27: టీయూ కామర్స్ విభాగంతో పాటు లా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ-కామార్స్ సైబర్ క్రైంపై బుధవారం వెబ్‌నార్ నిర్వహించారు. ఈ సదస్సుకు హైదరా బాద్ నల్సర్ యూనివర్సిటీ డాక్టర్ కేవి శాంతి, ఓయూ నుంచి ఆచార్య ప్యాట్రిక్ హాజరయ్యారు. సైబర్ క్రైం అనేది హ్యాకింగ్ పిషింగ్ సాఫ్ట్‌వేర్ వైకస్ వల్ల సైబర్ నేరాలకు పాల్పడుతు న్నారన్నారు. అంతర్జాలం వాడే వారు తమ సమాచారం గోప్యంగా ఉంచుకోవలన్నారు. పాస్‌వర్డు, ఓటీపీలను ఇతరుల కు పంచుకోరాదన్నారు. ఈ సదస్సులో వీసీ, రవీందర్, రిజిస్ట్రా ర్ కనకయ్య, ప్రిన్సిపల్ నాగరాజు, ప్రతినిధులు వినోద్, ఎల్లోస, రాంబాబు, స్రవంతి, ప్రసన్నరాణి, శ్రీనివాస్, నాగజ్యోతి, శ్వేత, గంగాధర్ పాల్గొన్నారు.
రక్తదానంపై అవగహన ఉండాలి
జాతీయ స్వచ్ఛంద రక్త దాన దినోత్సవంలో భాగంగా వర్సిటీలో బుధవారం విద్యార్థులకు బ్లడ్‌గ్రూప్ క్యాంప్‌ను జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ కనకయ్య మాట్లాడుతూ ఇలాంటి శిబిరా ల ద్వారా భవిష్యత్తులో రక్తం అవసరం ఉన్నప్పుడు రక్తదానం చేయడానికి సులభం అవుతుందన్నారు. 176 మంది విద్యార్థులు వారి రక్త నమూనాలను పరిశీలించుకున్నారు.
పోటీ పరీక్షల శిక్షణ కేంద్ర డైరెక్టర్‌గా శ్రీనివాస మూర్తి
పోటీ పరీక్షల శిక్షణ కేంద్ర డైరెక్టర్‌గా తెలుగు అధ్యాయన విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాలశ్రీనివాస మూర్తి, ఈక్వల్ అపర్చునిటీ సెల్ డైరెక్టర్‌గా పార్మసుటికల్ కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ, బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్‌గా తెలుగు విభాగానికి డాక్టర్ లక్ష్మన చక్రవర్తి నియామకమయ్యారు. వీరికి వీసీ రవీందర్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ కనకయ్య బుధవారం నియామక పత్రాలు అందజేశారు.