పార్టీ సమావేశానికి హాజరైన టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు

ABN , First Publish Date - 2021-10-20T05:25:21+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గాల సమన్వయ సమావేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగింది.

పార్టీ సమావేశానికి హాజరైన టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు
సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

పార్టీ ప్లీనరీ, వరంగల్‌ బహిరంగ సభ విజయవంతంపై చర్చ

నిజామాబాద్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గాల సమన్వయ సమావేశం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీజీగౌడ్‌, రాజేశ్వర్‌, కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్‌, జడ్పీ చైర్మ న్‌ విఠల్‌రావు, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, రెడ్‌కో చైర్మన్‌ అలీం, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. అలాగే, ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన ముఖ్యమైన నేత లు హాజరయ్యారు. పలు అంశాలపైన చర్చించారు. నియోజకవర్గాల వారీగా ప లు అంశాలను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 27న జరిగే పార్టీ ప్లీనరి, వచ్చే నెల వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు ఎలా సన్నద్ధం కావాలో వారికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశా నిర్దేశం చేశా రు. నియోజకవర్గాల వారీగా ప్లీనరికి ఎవరెవరు హాజరవుతారో వారికి వివరించారు. తమ పరిధిలో అందరూ పార్టీ కోసం మరింత పటిష్ఠంగా పనిచేయాలని ఆయన కోరారు. ఈ సమావేశానికి ఆయా నియోజకవర్గాల పరిధిలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు, రైతు సమన్వయ కమిటీ నేతలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Updated Date - 2021-10-20T05:25:21+05:30 IST