మహారాష్ట్ర సరిహద్దుల్లో కందకాల తవ్వకం

ABN , First Publish Date - 2021-05-19T04:50:40+05:30 IST

మండలానికి పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రమైన మహా రాష్ట్రలో కరోనా కారణంగా పరిస్థితి భయంకరంగా ఉన్నందున సరిహద్దులో ఉన్న గ్రామాల నుంచి రాకపోకలు నిలిపి వేస్తూ కందకాలు తవ్వుతున్నారు.

మహారాష్ట్ర సరిహద్దుల్లో కందకాల తవ్వకం
మహారాష్ట్ర సరిహద్దులో కందకాలు తవ్వుతున్న దృశ్యం

మద్నూర్‌, మే 18: మండలానికి పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రమైన మహా రాష్ట్రలో కరోనా కారణంగా పరిస్థితి భయంకరంగా ఉన్నందున సరిహద్దులో ఉన్న గ్రామాల నుంచి రాకపోకలు నిలిపి వేస్తూ కందకాలు తవ్వుతున్నారు. మహారాష్ట్ర నుంచి ఎవ్వరు రాకుండా కందకాలను తవ్విస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. మంగళవారం సరిహద్దులోని ఆయా గ్రామాల్లో జేసీబీతో గ్రామాల గుండా అడ్డదారుల్లో లోపలికి రాకుండా కందకాలను తవ్విస్తు న్నారు. మహారాష్ట్ర సరిహద్దులో మద్నూర్‌ మండలానికి సంబంధించి 12 గ్రామ పంచాయతీలు, రెండు హ్యాబిటేషన్లు ఉన్నాయని, కరోనా కట్టడి కోసం ఇటువంటి కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదని తహసీల్దార్‌ వెంకట్రావు అన్నారు. జిల్లాలోని మారుమూల మండలమైన మద్నూర్‌ మండలం గుండానే మహారాష్ట్ర నుంచి ప్రజలు రావడంతో కరోనా పెరుగుతున్నట్లు, ప్రభుత్వం గుర్తించి మహారాష్ట్ర సరిహద్దులో రోడ్డుపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు ఆయా గ్రామాల గుండా రావడం వల్ల కందకాలు
తవ్వించి అక్కడి నుంచి రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారు.

Updated Date - 2021-05-19T04:50:40+05:30 IST