పనుల్లో పారదర్శకత పాటించాలి

ABN , First Publish Date - 2021-11-26T05:46:27+05:30 IST

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పాటిం చాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల ప్రణాళిక 2022-23 సంవత్స రానికి గాను జిల్లాలోని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు, మండల పంచాయతీ అధికారులకు, అదనపు కార్యక్రమ అధికారులకు, ఇంజినీరింగ్‌ కన్సల్టెం ట్‌లకు సాంకేతిక సహాయకులకు గురువారం డిచ్‌పల్లి టీటీడీసీలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

పనుల్లో పారదర్శకత పాటించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణ రెడ్డిడిచ్‌పల్లి, నవంబరు 25:  ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత పాటిం చాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనుల ప్రణాళిక 2022-23 సంవత్స రానికి గాను జిల్లాలోని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులకు, మండల పంచాయతీ అధికారులకు, అదనపు కార్యక్రమ అధికారులకు, ఇంజినీరింగ్‌ కన్సల్టెం ట్‌లకు సాంకేతిక సహాయకులకు గురువారం డిచ్‌పల్లి టీటీడీసీలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ నారాయణరెడ్డి హాజరై మాట్లాడుతూ.. ప్రణాళిక తయారీలో భాగంగా లేబర్‌ బడ్జెట్‌కు అనుగు ణంగా, గ్రామాలకు ఉపయోగ పడేలా నీటి సంరక్షణ పనులు, భూగర్భ జలాలను పెంపొందించే పనులు గుర్తించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. చేపట్టిన ప్రతీ పనిలో పారదర్శకత పాటించి నాణ్యమైన పనులను చేపట్టాలన్నారు. ప్రతీ గ్రామంలో ప్రణాళిక బద్ధంగా సంవత్సరం పొడువునా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
శిక్షణ ద్వారా స్వయం ఉపాధికి అవకాశాలు
డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ఎస్‌బీఐ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం అందించే శిక్షణ ద్వారా స్వయం ఉపాధి భరోసా లభిస్తుందని కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. గురువారం డిచ్‌పల్లి ఎస్‌బీఐ శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఈటీఐ ద్వారా స్వయం ఉపాధికి శిక్షణ పొందిన అభ్యర్థులకు ఽద్రువీకరణ పత్రాలు కలెక్టర్‌ అందజేశారు. ఆర్‌ఎస్‌ఈటీఐ ఆధ్వర్యంలో సీసీటీవీ శిక్షణ ముగించుకున్న ట్రైనీస్‌కు కలెక్టర్‌ సర్టిఫికెట్లు, టూల్‌ కిట్స్‌ పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ... ఈ శిక్షణ ప్రతీ ఒక్కరూ సద్వినియోగం  చేసుకోవాలని శిక్షణ ద్వారా జీవితంలో స్వయం ఉపాధి పొంది తమ కుటుంబాలకు భరోసాగా నిలవాలని సూ చించారు. ఎస్‌బీఐ ఆర్‌ఎస్‌ఈటీఐ ద్వారా చక్కని శిక్షణ అందిస్తున్నరని, గ్రామీణ ప్రాంత యువతీ, యువకులు మంచి పరిజ్ఞానం పొంది జీవితంలో స్థిరపడాలని  కోరారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌ సుధీంద్ర బాబు, సిబ్బంది, రామకృష్ణ, భాగ్యలక్ష్మి, నవీన్‌, రంజిత్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఓటరులో జాబితాలో పేరు నమోదుపై విచారణ
మండలంలోని మిట్టపల్లి, రాంపూర్‌, గ్రామాల్లో ఎస్‌ఎస్‌ఆర్‌ పరిశీలకు లు విజయ్‌ కుమార్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డితో కలిసి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారి ఇళ్లకు వారితో మాట్లాడారు. స్పెషల్‌ సమ్మ రి రివిజన్లో భాగంగా ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్న వారి వివరా లను అడిగి తెలుసుకున్నారు. ఓటరుగా నమోదు చేసుకున్న వివరాలను కలెక్టర్‌ డిగి తెలుసుకున్నారు. డిచ్‌పల్లి తహసీల్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ నారాయణ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధరణి వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ర్టేషన్‌ తీరుతెన్నులను తహసీల్దార్‌ శ్రీనివాస్‌ రావు, నాయబ్‌ తహసీల్దార్‌ ఆశ్వినిని అడిగి తెలుసుకున్నారు. ధరణి ద్వారా ఎలాంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడం లేదని కలెక్టర్‌కు అధికారులు వివరించారు.
అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలి
నిజామాబాద్‌ అర్బన్‌ : 2022 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకో వాలని, తప్పులు లేని జాబితా సిద్ధం చేయాలని ఎస్‌ఎస్‌ఆర్‌ పరిశీలకు విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఓటరు నమోదు కార్యక్రమంపై గురువారం కలెక్టర్‌ నారాయణరెడ్డితో కలిసి కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఓటరు నమోదుపై బీఎల్‌వోల నుంచి జిల్లా అధికారుల వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. క్లెయిమ్స్‌ కోసం వచ్చే దరఖాస్తులను బీఎల్‌వోలు పరిశీలించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - 2021-11-26T05:46:27+05:30 IST